Corona Virus: వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్!

Two YSRCP MLAs tested Corona Positive
  • ఇటీవల కన్నుమూసిన ఆర్కే తండ్రి
  • అంత్యక్రియల్లో పాల్గొనడంతో పాజిటివ్
  • హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన ఆర్కే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తాజాగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణా రెడ్డి)తో పాటు తూర్పు గోదావరి జిల్లా, తుని శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తన తండ్రి దశరథరామిరెడ్డి మరణించడంతో, అంత్యక్రియల్లో పాల్గొన్న వేళ, ఎవరి ద్వారానో ఆర్కేకు కరోనా సోకినట్టు సమాచారం.

తనకు కరోనా సోకడంతో రెండు వారాల పాటు హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లనున్నానని ప్రకటించిన ఆర్కే, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని, పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. మరోపక్క, దాడిశెట్టి రాజా చెబుతూ, వైద్య చికిత్స పొందేందుకు తాను విశాఖపట్నంలోని ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. 
Corona Virus
VSRCP
RK
Dadisetti Raja

More Telugu News