సీరమ్ ఇనిస్టిట్యూట్ కు డీసీజీఐ షోకాజ్ నోటీసులు!
- వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు ఇవ్వండి
- వాలంటీర్లకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు వచ్చాయా?
- సమాచారాన్ని అందించాలన్న డీసీజీఐ
కాగా, లండన్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ కు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాడవంతో ట్రయల్స్ ను బ్రిటన్ తో పాటు దక్షిణ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నిలిపివేస్తున్నామని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తరువాతనే తదుపరి ట్రయల్స్ కొనసాగింపుపై స్పష్టతనిస్తామని ఆస్ట్రాజెనికా సీఈఓ స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఇండియాలో ట్రయల్స్ కొనసాగుతున్నాయని సీరమ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.