NVSS Prabhakar: సీఎంగా జగన్ వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

NVSS Prabhakar says attacks on temples raised after CM Jagan came to rule
  • మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపణ
  • మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • సీఎం  జగన్ వెంటనే స్పందించాలన్న ఎన్వీఎస్ఎస్
అంతర్వేది ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సీఎంగా జగన్ వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. రథం దగ్ధం ఘటనపై వైసీపీ మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మంత్రులు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రథం దగ్ధం ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని ఎన్వీఎస్ఎస్ అన్నారు.

కాగా, అంతర్వేది ఘటన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళనకు పిలుపునివ్వడంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నేతలకు గృహనిర్బంధం విధించినట్టు తెలుస్తోంది.
NVSS Prabhakar
Jagan
Attacks
Temples
Andhra Pradesh
BJP

More Telugu News