అనంతపురం-న్యూఢిల్లీ కిసాన్ రైలును ప్రారంభించిన సీఎం జగన్
- అనంత రైతులకు కేంద్రం చేయూత
- పండ్ల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కిసాన్ రైలు
- ఢిల్లీ నుంచి పచ్చజెండా ఊపిన కేంద్రమంత్రులు
ఈ కిసాన్ రైలు ద్వారా అనంతపురం జిల్లా పండ్ల ఉత్పత్తులను దేశ రాజధానిలో మార్కెటింగ్ చేసేందుకు వీలు కలగనుంది. తద్వారా రైతులకు మరింత మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అనంతపురం నుంచి అనేక రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కు కూడా ఫలాలు ఎగుమతి అవుతుంటాయి.
కాగా, ఈ కిసాన్ రైలు తొలి ప్రయాణంలో 500 టన్నుల వివిధ రకాల పండ్లు, రైతులు, వ్యాపారులు, అధికారులు ప్రయాణించేందుకు ప్రత్యేక స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. రైతులు సత్వరమే తమ పంటలను ఢిల్లీ తరలించేందుకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.