Jayaprakash Reddy: జయప్రకాశ్ రెడ్డి కుటుంబానికి బాలకృష్ణ ఆర్థికసాయం?

Balakrishnas financial help to  Jayaprakash Reddys family
  • గుండెపోటుతో నిన్న మృతి చెందిన జయప్రకాశ్ రెడ్డి
  • మంచి ఆత్మీయుడిని కోల్పోయానన్న బాలయ్య
  • రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేసినట్టు సమాచారం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయారనే బాధ నుంచి ఇంకా టాలీవుడ్ కోలుకోలేదు. ఆయన లేని లోటును తీర్చలేమని చిరంజీవి వంటి సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

బాలకృష్ణ కూడా ఆయన మృతిపై స్పందిస్తూ... మంచి ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిత్రాలలో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. సినీ రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్లుగా భావించేవారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇదే సమయంలో మరో విషయం వినిపిస్తోంది. జయప్రకాశ్ కుటుంబానికి బాలయ్య రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్టు  తెలుస్తోంది.
Jayaprakash Reddy
Tollywood
Balakrishna

More Telugu News