కుతంత్రాలను ఉపేక్షించేది లేదు!: రథం దగ్ధంపై విజయసాయిరెడ్డి
- వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటున్నారా?
- చట్టం తన పని తాను చేసుకుపోతుంది
- దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు
- కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు
"రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది" అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.