Devineni Uma: పబ్జీ గేమ్ ఆగిపోవడంతో సీఎం జగన్ కు ఏం చేయాలో తెలియడం లేదు: దేవినేని ఉమ

Devineni Uma says CM Jagan does not know what to do after PUBG ban
  • సీఎం జగన్ పై ఉమ విమర్శనాస్త్రాలు
  • పబ్జీ గేమ్ ప్రజలపై ఆడుతున్నారని వ్యంగ్యం
  • అమరావతి అంగుళం కూడా కదలదంటూ స్పష్టీకరణ
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పబ్జీ గేమ్ ఆగిపోవడంతో సీఎం జగన్ కు ఏంచేయాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. దాంతో ఆ ఆటను ప్రజలపై ఆడుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. అమరావతి అంగుళం కూడా కదలదని దేవినేని ఉమ స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్మించిన అసెంబ్లీ, సచివాలయంలో కూర్చుని ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నుతోందని మండిపడ్డారు.
Devineni Uma
Jagan
PUBG
Ban
Amaravati
Andhra Pradesh

More Telugu News