Jayaprakash Reddy: సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి!

Actor Jayaprakash Reddy funerals ended
  • గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
  • ఉదయం గుండెపోటుతో మృతి చెందిన జయప్రకాశ్ రెడ్డి
  • దిగ్భ్రాంతికి గురైన తెలుగు సినీ పరిశ్రమ
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి జయప్రకాశ్ రెడ్డి గుంటూరు విద్యానగర్ లోనే ఉంటున్నారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Jayaprakash Reddy
Tollywood
Funerals

More Telugu News