రియా ఓ డ్రగ్స్ బానిసను ప్రేమించింది: న్యాయవాది సతీశ్ వ్యాఖ్యలు
- రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు
- న్యాయం అపహాస్యానికి గురైందన్న న్యాయవాది
- ఒంటరి మహిళను వెంటాడుతున్నారని వ్యాఖ్యలు
సుశాంత్ వ్యవహారంలో దాదాపు అన్ని కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణలో పాలుపంచుకుంటున్నాయి. ఈడీ, సీబీఐ, ఎన్సీబీ ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు శ్రమిస్తున్నాయి. దీనిపై రియా న్యాయవాది సతీశ్ మానే షిండే స్పందిస్తూ, అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ డ్రగ్స్ కు బానిసైన వ్యక్తిని ప్రేమించిన నేరానికి ఓ ఒంటరి మహిళను మూడు దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయని పేర్కొన్నారు.