Acharya: కామెడీ చిత్రాన్ని నిర్మిస్తోన్న 'ఆచార్య' నిర్మాతలు

Matinee Entertainment produces another film
  • 'ఏజంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ కి పేరు 
  • తాజాగా మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో ఛాన్స్
  • బౌంటీ హంటింగ్ నేపథ్యంలో సాగే కామెడీ సినిమా
ప్రతిభగల సాంకేతిక నిపుణులకు మన చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సాహాన్నిస్తుంది. ఒక మంచి సినిమా తీసిన దర్శకుడికి తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం యువ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జేకు కూడా అలాంటి మంచి అవకాశం వచ్చింది. స్వరూప్ ఆమధ్య 'ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి వినూత్న కథా చిత్రాన్ని రూపొందించి అందర్నీ ఆకట్టుకున్న సంగతి విదితమే.    

ఇప్పుడు ఇతనితో మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఓ వెరైటీ కథా చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య', నాగార్జునతో 'వైల్డ్ డాగ్' వంటి భారీ చిత్రాలను నిర్మిస్తోంది. స్వరూప్ దర్శకత్వంలో ఒక ఇంటరెస్టింగ్ ఫిలిం నిర్మిస్తున్నామనీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ పేర్కొంది. కాగా బౌంటీ హంటింగ్ (నేరస్థుల్ని పట్టించి డబ్బు సంపాదించే పని) నేపథ్యంలో సాగే కామెడీ చిత్రంగా దీనిని రూపొందించనున్నారు.
Acharya
Wild Dog
Matinee Entertainment
Swaroop

More Telugu News