Balakrishna: 'లవకుశ' నాగరాజు గారి మృతి వ్యక్తిగతంగా ఎంతో లోటుగా భావిస్తున్నాను: నందమూరి బాలకృష్ణ

Balakrishna reacts on the demise of Tollywood actor Nagaraju who played Lavudu role in Lavakusha
  • లవకుశ చిత్రంలో లవుడి పాత్రధారి నాగరాజు కన్నుమూత
  • ఎంతో బాధగా ఉందన్న బాలకృష్ణ
  • నాగరాజు గారంటే ఎంతో ఇష్టమంటూ ప్రకటన
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీనియర్ నటుడు నాగరాజు మృతిపై స్పందించారు. అలనాటి లవకుశ చిత్రంలో లవుడి పాత్ర పోషించిన నాగరాజు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిన్న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. దీనిపై బాలకృష్ణ తన సందేశం వెలువరించారు. "నేను లవకుశ చిత్రాన్ని లెక్కలేనన్ని సార్లు చూశాను. అందులో లవుడిగా నటించిన నాగరాజు గారంటే నాకెంతో ఇష్టం. ఆయన హఠాత్తుగా మరణించడం తీవ్రమైన బాధ కలిగించింది. ఆయన మృతిని వ్యక్తిగతంగా ఎంతో లోటుగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ బాలకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Balakrishna
Nagaraju
Lavudu
Lavakusha
Tollywood

More Telugu News