Kannada Actress: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన అరెస్ట్

Actress Sanjana arrested in drugs case
  • కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ భూతం కలకలం
  • సంజన ఇంట్లో సోదాలు జరిపిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
  • అనంతరం అదుపులోకి తీసుకున్న వైనం
కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ విచారణ వణికిస్తోంది. తాజాగా హీరోయిన్ సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులను నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి ముందు మరో కన్నడ నటి రాగిణి ద్వివేది నివాసంపై కూడా అధికారులు రెయిడ్ చేశారు. మరో నటుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకే సీసీబీ అధికారులు సంజన నివాసంపై దాడులు నిర్వహించారు.

తమ విచారణలో రాహుల్ పలు వివరాలను వెల్లడించాడని ఈ సందర్భంగా సీసీబీ వర్గాలు తెలిపాయి. సంజన, రాహుల్ ఇద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనే వారని, పొరుగు దేశాల్లోని పలు కేసినోలకు వెళ్లేవారని చెప్పాయి. పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ ను సరఫరా చేయడం వంటి అభియోగాలను రాహుల్ పై మోపినట్టు తెలిపారు. ఇప్పుడు సంజనను విచారిస్తున్నామని చెప్పారు.  

'సర్దార్ గబ్బర్ సింగ్', 'యమహో యమ', 'బుజ్జిగాడు' తదితర చిత్రాల్లో సంజన నటించింది. కన్నడ చిత్రం 'దండుపాళ్యం'లో ఆమె నటకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ఆమె అరెస్ట్ కావడం... కన్నడ పరిశ్రమతో పాటు టాలీవుడ్ లో సైతం ప్రకంపనలు రేపుతోంది.
Kannada Actress
Sanjana
Arrest
Drugs

More Telugu News