Madhya Pradesh: పెంపుడు ఎలుకను చంపేసిందట.. 10 ఏళ్ల బాలికను కొట్టి చంపిన 11 ఏళ్ల విద్యార్థి

 10 year old school girl murdered by a minor boy
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • అనుమానంతో బాలికపై బండరాయితో దాడి
  • చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాను పెంచుకుంటున్న పెంపుడు ఎలుకను చంపేసిందన్న కారణంతో 11 ఏళ్ల విద్యార్థి ఐదో తరగతి చదువుతున్న బాలికను దారుణంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లసూడియా పరిధిలో ఐదో తరగతి చదువుతున్న 10 ఏళ్ల  బాలిక తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో ఐదో తరగతి చదువుతున్న బాలికతో గొడవ పడ్డాడు. అనంతరం బండరాయితో ఆమె తలపై మోది హత్య చేసి పరారయ్యాడు.

ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. అదుపులోకి తీసుకున్న బాలుడిని బాల నేరస్తుల శిక్షణాలయానికి తరలిస్తామని డీఐజీ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. అనుమానంతో బాలుడిని అదుపులోకి తీసుకోగా అసలు విషయం చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. తాను పెంచుకుంటున్న ఎలుకను చంపేసిందన్న అనుమానంతో నిన్న బాలికతో గొడవపడ్డాడని, అనంతరం పెద్ద రాయితో ఆమె తలపై కొట్టడంతో చిన్నారి చనిపోయిందని వివరించారు. తలపై గాయం కావడంతో రక్తస్రావం జరిగి బాలిక మరణించినట్టు డీఐజీ తెలిపారు.
Madhya Pradesh
Indore
Rat
Killed
Crime News

More Telugu News