Almonds: టిఫిన్ బదులు బాదం తింటే హృదయ సంబంధిత సమస్యలు పరార్!

  • గుండె వేగ వ్యత్యాసాన్ని నియంత్రించే బాదం
  • ఆరు వారాలపాటు తీసుకుంటే గుండె పదిలం
  • అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం
Almonds Are regulate Human HRA

బాదంను తినడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. అయితే, దీనిని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చని అంటోంది తాజా అధ్యయనం. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ఉదయం తీసుకునే టిఫిన్‌కు బదులుగా కొన్ని బాదంలను తింటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని పేర్కొంది. మానసిక ఆందోళనకు గురైనప్పుడు పెరిగే గుండె వేగ వ్యత్యాసం (హెచ్ఆర్‌వీ) పడిపోవడాన్ని ఇది నిరోధిస్తుందని వివరించింది.

హెచ్ఆర్‌వీ అంటే మరేంటో కాదు.. గుండెలో రెండు వరుస చప్పుళ్ల మధ్య ఉన్న వ్యవధినే హెచ్ఆర్‌వీ అంటారు. నిజానికి హెచ్ఆర్‌వీని వ్యాయామం, తీసుకునే ఆహారం వంటివి నిర్ధారిస్తాయి. హెచ్ఆర్‌వీ తక్కువ ఉంటే గుండె నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే ఎక్కువ ఉంటే మానసిక, పరిసర సవాళ్లను గుండె సమర్థంగా ఎదుర్కొంటుందని అధ్యయనం పేర్కొంది. కాబట్టి ఆరు వారాలపాటు బాదంపప్పును టిఫిన్‌గా తీసుకుంటే హృదయ స్పందనలు మెరుగవుతాయని అధ్యయనం వివరించింది.

More Telugu News