Sushant Singh Rajput: నార్కోటిక్స్ బ్యూరో విచారణలో బడా స్టార్ల పేర్లు చెప్పిన రియా చక్రవర్తి!

Rhea Revels Famous Bollywood Stars Names in Drugs Case
  • డ్రగ్స్ దందాపై ప్రశ్నించిన అధికారులు
  • కేదార్ నాథ్ సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్
  • సుశాంత్ కోరితేనే తెప్పించానన్న రియా
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులు, బాలీవుడ్ డ్రగ్స్ దందాపైనా దృష్టిని సారించగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, విచారణలో భాగంగా బడా స్టార్స్ పేర్లను అధికారుల ముందు వెల్లడించినట్టు తెలుస్తోంది. నిన్న కూడా రియాను ఎన్.సి.బి అధికారులు విచారించగా, ప్రశ్నలన్నీ డ్రగ్స్ దందాపై ఆమెకున్న లింకులపైనే ప్రధానంగా అధికారులు సంధించారని సమాచారం.

సుశాంత్ కోసం తాను డ్రగ్స్ కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని రియా అంగీకరించినట్టు తెలుస్తోంది. 'కేదార్ నాథ్' సినిమా షూటింగ్ సమయంలో తన స్నేహితులతో కలిసి సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడని, ఆ విషయం ఎవరికీ తెలియదని, అతని కోరిక మేరకే వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేశానని రియా తెలిపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుశాంత్ స్టాఫ్ మెంబర్స్ ద్వారానే అవి సరఫరా అవుతాయని కూడా రియా పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఇక ఇదే విచారణలో డ్రగ్స్ ను తెప్పించేందుకు తాను మాట్లాడిన వారి పేర్లను, అవి ఎవరి దగ్గరకు సులువుగా వస్తాయో అన్న వారి పేర్లను కూడా రియా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
Sushant Singh Rajput
Rhea
Drugs
Bollywood

More Telugu News