ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్తను అరెస్ట్ చేసిన ఈడీ
- మనీలాండరింగ్ అభియోగాలపై దీపక్ కొచ్చర్ అరెస్ట్
- గతేడాది క్రిమినల్ కేసు నమోదు
- రుణ మంజూరు అంశంలో అవకతవకల గుర్తింపు
ఈ కేసులో దర్యాప్తు బృందం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద గతేడాది ఆరంభంలో చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, వీడియో కాన్ గ్రూప్ కు చెందిన వేణుగోపాల్ ధూత్ లపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.1,875 కోట్ల రుణ మంజూరు అంశంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు.