Mammootty: చిరు భాయ్, ఏళ్లు గడిచినా మన స్నేహం చెక్కుచెదరలేదు: చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన మమ్ముట్టి

Mammootty thanked Tollywood Megastar Chiranjeevi
  • నేడు మమ్ముట్టి పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన చిరంజీవి
  • మద్రాస్ రోజులను గుర్తుచేసుకున్న మమ్ముట్టి
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. మీతో సాహచర్యం పట్ల గర్విస్తున్నానని తెలిపారు.  ఈ సందర్భంగా మమ్ముట్టి చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. "థాంక్యూ చిరు భాయ్! మన స్నేహాన్ని చూసుకుంటే మద్రాస్ లో గడిపిన రోజులకు వెళ్లాలి. ఎన్నో ఏళ్లు గడిచాయి, ఎన్నో జ్ఞాపకాలు... మన స్నేహం మాత్రం అలాగే ఉంది" అంటూ మమ్ముట్టి ట్విట్టర్ లో స్పందించారు.
Mammootty
Chiranjeevi
Birthday
Wishes
Tollywood
Kerala

More Telugu News