Vangalapudi Anitha: వచ్చే ఏడాది నుంచి అన్నయ్యకు ఇవ్వడానికి ర్యాంకులే ఉండవేమో!: వంగలపూడి అనిత

Vangalapudi Anitha comments on YCP leaders
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్
  • సీఎం జగన్ ను కలిసిన మంత్రి మేకపాటి బృందం
  • అభినందించిన సీఎం జగన్
  • ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారంటూ అనిత ట్వీట్
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి తొలిస్థానం వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ ను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఈడీబీ, సీఈవో కలవడం, వారిని సీఎం జగన్ అభినందించడం తెలిసిందే. దీనిపై వంగలపూడి అనిత వ్యంగ్యం ప్రదర్శించారు.

కరోనా సమయంలోనే ఈ రేంజిలో ఇరగదీశారంటే ఇక వచ్చే ఏడాది నుంచి అన్నయ్యకు ఇవ్వడానికి ర్యాంకులు ఉండవేమో అని సెటైర్ వేశారు. అయినా, ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారో అంటూ అనిత ట్వీట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగో ఏడాది కూడా ఏపీకి మొదటి స్థానం రావడానికి చంద్రబాబు, టీడీపీ కృషే కారణమని టీడీపీ నేతలు చెబుతుండడం తెలిసిందే.
Vangalapudi Anitha
YSRCP
Jagan
Mekapati Goutham Reddy
Ease Of Doing Business

More Telugu News