నాన్నకు కరోనా నెగెటివ్ వచ్చింది... ఐప్యాడ్ లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారు: ఎస్పీ బాలు తనయుడు
- వారాంతంలో పెళ్లి రోజు జరుపుకున్న బాలు దంపతులు
- ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స
- ఊపిరితిత్తులు పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాల్సి ఉందన్న చరణ్
అయితే, వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుందని అన్నారు. అయన ఊపిరితిత్తులు ఇంకా పూర్తిస్థాయి సామర్థ్యం సంతరించుకోలేదని, అందుకే వెంటిలేటర్ సాయం కొనసాగిస్తున్నారని చెప్పారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆయనకు నెగెటివ్ వచ్చినా తాము, దాని గురించి పట్టించుకోవడంలేదని, ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించామని తెలిపారు.
ఆగస్టులో కొవిడ్ కారణంగా ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించడం తెలిసిందే.