Bigg Boss Telugu 4: బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం.. 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే!

Bigg Boss fourth season starts
  • నేటి నుంచి బిగ్ బాస్ నాలుగో సీజన్ షురూ
  • అత్యంత రిచ్ గా బిగ్ బాస్ ఇల్లు
  • వేదికగా నాగ్ డబుల్ రోల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ 4వ సీజన్ ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున తన సమ్మోహనకరమైన మాటలతో బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులకు స్వాగతం పలికారు. ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. వృద్ధ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్ కు పరిచేయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. గార్డెన్ నుంచి కిచెన్ వరకు ప్రతిదీ నవ్యత సంతరించుకుంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్... ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.

బిగ్ బాస్-4 కోసం హౌస్ లో ఎంటరైన సభ్యులు వీరే...

  • మోనాల్ గజ్జర్ (హీరోయిన్)
  • సూర్యకిరణ్ (దర్శకుడు)
  • లాస్య (యాంకర్)
  • అభిజిత్ (నటుడు)
  • జోర్దార్ సుజాత (యాంకర్)
  • మహబూబ్ దిల్ సే (యూట్యూబర్)
  • దేవి నాగవల్లి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్)
  • దేత్తడి హారిక (యూట్యూబర్)
  • సయ్యద్ సొహైల్ రియాన్ (నటుడు) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
  • అరియానా గ్లోరీ (యాంకర్) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
  • అమ్మ రాజశేఖర్ (కొరియోగ్రాఫర్ )
  • కరాటే కల్యాణి (నటి)
  • నోయల్ షాన్ (సింగర్/నటుడు)
  • దివి (మోడల్/నటి)
  • అఖిల్ సార్థక్ (నటుడు)
  • గంగవ్వ (యూట్యూబర్)
Bigg Boss Telugu 4
Nagarjuna
Reality Show
Andhra Pradesh
Telangana

More Telugu News