Recovery Rate: దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ శాతం

  • ఆగస్టు 23న 57 వేల మంది రికవరీ
  • నిన్న ఒక్కరోజే 73 మంది రికవరీ
  • ఇప్పటివరకు 31.80 లక్షల మందికి కరోనా నయం
Corona recovery rate increases in country

దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నా, భారీస్థాయిలో కొత్త కేసులు వస్తున్నా, రికవరీ శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.32గా ఉంది. ఆగస్టు 23వ తేదీన కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 57 వేలుగా కాగా, సెప్టెంబరు 5న 73 వేల మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు.

దీనిపై కేంద్రం వర్గాలు స్పందించాయి. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా రోగులను ముందుగానే గుర్తించగలుగుతున్నామని, తద్వారా సత్వరమే వైద్య చికిత్స అందించడం వల్ల రికవరీ రేటు పెరుగుతోందని వెల్లడించాయి. గత పది రోజులుగా రికవరీ శాతంలో పెరుగుదల కనిపిస్తోందని ఇది శుభసంకేతమని తెలిపాయి. ఇప్పటివరకు దేశంలో 41 లక్షల కరోనాకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,80,000 మంది కోలుకున్నారు.

More Telugu News