Chandrababu: చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Chandrababu escapes from road accident
  • విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తుండగా ప్రమాదం
  • కాన్వాయ్ కి అడ్డొచ్చిన ఆవు
  • డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. ఢీకొన్న వాహనాలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా... ఓ ఆవు కాన్వాయ్ కి అడ్డం వచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు.

క్రమంలో కాన్వాయ్ లోని రెండు, మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో చంద్రబాబు సహా, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు కదిలింది.
Chandrababu
Convoy
Accident
Telugudesam

More Telugu News