Sameera Reddy: నీతో నటించడం చాలా బోరింగ్ అని ఓ హీరో అన్నాడు: సమీరా రెడ్డి

Sameera Reddy speaks about nepotism
  • ముద్దు  సీన్ గురించి ప్రశ్నిస్తే బెదిరించారు
  • బాలీవుడ్లో నెపోటిజం ఉంది
  • తప్పుటడుగు వేస్తే పాము నోటికి చిక్కినట్టే
సినీ రంగంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బహిర్గతం చేశారు. తాజాగా ఈ అంశంపై మరో నటి స్పందించింది. పలు తెలుగు సినిమాల్లో నటించిన సమీరారెడ్డి  తాజాగా మాట్లాడుతూ, గతంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించినప్పుడు... షూటింగ్ మధ్యలో ముద్దు సన్నివేశం గురించి చెప్పారని తెలిపింది. స్క్రిప్ట్ చెప్పినప్పుడు దీని గురించి చెప్పలేదుకదా అని తాను ప్రశ్నించగా... సినిమా నుంచి నిన్ను తప్పించడం పెద్ద విషయం కాదని దురుసుగా సమాధానమిచ్చారని చెప్పారు.

నీతో కలిసి నటించడం చాలా బోరింగ్ అని ఓ హీరో డైరెక్ట్ గానే చెప్పేశాడని... ఇకపై నీతో కలిసి చేయనని అన్నాడని... ఆ తర్వాత ఏ సినిమాలో తనను తీసుకోలేదని సమీర తెలిపింది. బాలీవుడ్ లో నెపోటిజం ఉందని చెప్పింది. స్టార్ కిడ్స్ ను ప్రోత్సహించేందుకు తన చేతి వరకు వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారని తెలిపింది. సినీ పరిశ్రమలో ఎంతో జాగ్రత్త అవసరమని... ఒక తప్పుటడుగు వేసినా పాము నోటికి చిక్కినట్టేనని చెప్పింది.
Sameera Reddy
Bollywood
Tollywood
Kiss

More Telugu News