Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ మృతి కేసు.. రియా సోదరుడు, సుశాంత్ మేనేజర్ అరెస్ట్

Rhea Chakrabortys Brother Arrested Over Drug Charges
  • షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాలు అరెస్ట్
  • పది గంటల విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ
  •  షోవిక్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ 
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అతడి గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

 అంతకుముందు నిన్న ఉదయం షోవిక్, మిరండా నివాసాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. షోవిక్ చక్రవర్తి గంజాయి, మరిజువానాలను ఆర్డర్ చేసి డ్రగ్ సరఫరాదారు అబ్దుల్ బాసిత్ పరిహార్‌కు గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపేవాడని ఎన్‌సీబీ కోర్టుకు తెలియజేసింది.  
Sushant Singh Rajput
Rhea Chakraborty
Samuel Miranda
Showik

More Telugu News