Rajnath Singh: చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ.. గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత ఇదే తొలిసారి!

  • మాస్కో వేదికగా షాంఘై సహకార సంస్థ సదస్సు
  • చైనా రక్షణ మంత్రితో పలు కీలక అంశాలపై రాజ్‌నాథ్ చర్చ
  • లడఖ్ సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపైనా చర్చించిన నేతలు
Rajnath Singh meets Chinese counterpart

మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న సాయంత్రం చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది.

అలాగే, లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా వీరు చర్చించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని కొనసాగించాలని రాజ్‌నాథ్ కోరారు. మే నెలలో లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.

More Telugu News