ఏపీలో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి... గడచిన 24 గంటల్లో 10,776 కొత్త కేసులు
- గత 24 గంటల్లో 76 మంది మృతి
- కొత్తగా 10,776 మందికి కరోనా పాజిటివ్
- 12,334 మందికి కరోనా నయం
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,405 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు. తాజాగా 12,334 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ మహమ్మారి నుంచి విముక్తులైన వారి సంఖ్య 3,70,163గా నమోదైంది. ఇంకా 1,02,067 మంది చికిత్స పొందుతున్నారు.