Naga Chaitanya: ఇద్దరు భామలతో నాగ చైతన్య రొమాన్స్!

Naga Chaitanya to romance with Two heroins
  • విక్రంకుమార్ దర్శకత్వంలో చైతూ 'థ్యాంక్యూ'
  • కథానాయికలుగా రకుల్, ప్రియా భవానీ శంకర్
  • అక్టోబర్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్  
తమిళ దర్శకుడు విక్రంకుమార్ వైవిధ్యమైన కథా చిత్రాలకు పెట్టింది పేరు. గతంలో అక్కినేని కుటుంబ హీరోలతో 'మనం' వంటి కొత్తతరహా చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్యతో చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి 'థ్యాంక్యూ' అనే పేరుని వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించారు.

ఇక ఇందులో ఇద్దరు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. మరో కథానాయిక పాత్రకు తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక కూడా పూర్తికావచ్చింది. అక్టోబర్ మొదటి వారం నుంచి షూటింగును నిర్వహించాలని షెడ్యూల్స్ వేస్తున్నారట. గతంలో చైతూ, రకుల్ కలసి 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మరోసారి కనువిందు చేయనున్నారు.
Naga Chaitanya
Rakul Preet Singh
Priya Bhavani Shankar
Vikram Kumar

More Telugu News