Pawan Kalyan: మీరు లేకుండా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఊహించుకోలేను: నదియాకు పవన్ రిప్లయ్

Pawan Kalyan replies to his costar Nadiya in Attarintiki Daredi movie
  • నిన్న పవన్ పుట్టినరోజు
  • తనకు విషెస్ చెప్పిన వారికి బదులిస్తున్న పవన్
  • థ్యాంక్స్ నదియా మేడమ్ అంటూ ట్వీట్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తన పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తిన శుభాకాంక్షల జడివానలో తడిసిముద్దయ్యారు. తనకు విషెస్ తెలిపిన సెలబ్రిటీలకు ఆయన తప్పకుండా రిప్లయ్ ఇస్తున్నారు.

తనతో 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన సీనియర్ నటి నదియాకు కూడా ఆయన బదులిచ్చారు. నిన్న పవన్ బర్త్ డే సందర్భంగా, నదియా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ, "మీ గుడ్ విషెస్ కు థ్యాంక్స్ నదియా మేడమ్. మీరు లేకుండా 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని ఏమాత్రం ఊహించుకోలేను" అంటూ ఎంతో గౌరవభావంతో ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Nadiya
Birthday
Wishes
Attarintiki Daredi

More Telugu News