SP Charan: ఈ వారాంతం తర్వాత శుభవార్త రానుంది: ఎస్పీ బాలు తనయుడు

SP Charan says there should be a good news on his father SP Balasubrahmanyam health
షార్ట్స్‌లో చూడండి
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య స్థితి క్రమంగా మెరుగవుతోందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. తాజాగా ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్యంపై ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా అప్ డేట్ ఇచ్చారు.

వరుసగా నాలుగో రోజు ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత నిలకడగా ఉందని, ఈ వారాంతం తర్వాత తన తండ్రి ఆరోగ్యం గురించి శుభవార్త తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడి ఆశీస్సులు, ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రార్థనల ఫలితంగా బహుశా సోమవారం నాటికి మా నాన్న ఆరోగ్యంపై గుడ్ న్యూస్ వింటామని భావిస్తున్నా అంటూ వీడియోలో పేర్కొన్నారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
SP Charan
SP Balasubrahmanyam
Health
Corona Virus

More Telugu News