Jagapathi Babu: నాగశౌర్య కొత్త చిత్రంలో కీలకపాత్రలో జగపతిబాబు

Jagapathi Babu plays crucial role in Nagashaurya new movie
  • విలువీరుడిగా నాగశౌర్య
  • సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం
  • సెప్టెంబరు 18 నుంచి షూటింగ్
నాగశౌర్య విలువీరుడి పాత్ర పోషిస్తున్న కొత్త చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత జగపతిబాబు ఎక్కువగా అగ్రహీరోల చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు, తండ్రి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాగశౌర్య వంటి యువ హీరో చిత్రంలో నటిస్తుండడంతో ఆ చిత్రానికి మరింత ప్లస్ కానుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరు 18 నుంచి జరగనుంది. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
Jagapathi Babu
Nagashaurya
NS20
Archer
Tollywood

More Telugu News