Kangana Ranaut: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నన్ను బహిరంగంగా బెదిరించారు: కంగనా రనౌత్

Shiv Sena MP Sanjay Raut geven me open threat says Kangana Ranaut
  • సంజయ్ రౌత్ పై విమర్శలు గుప్పించిన కంగన
  • ముంబైకి రావద్దని బెదిరించాడన్న ఫైర్ బ్రాండ్
  • ముంబై తనకు పీవోకే మాదిరి కనిపిస్తోందని వ్యాఖ్య
శివసేన కీలక నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముంబైకి తిరిగి రావద్దంటూ ఆయన తనను ఓపెన్ గా బెదిరించారని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ముంబై వీధుల్లోని గోడలపై ఇప్పటి వరకు ఆజాదీ రాతలను చూశామని... ఇప్పుడు బహిరంగ బెదిరింపులను చూస్తున్నామని మండిపడింది.

ముంబై తనకు పాక్ ఆక్రమిత కశ్మీర్ మాదిరి కనిపిస్తోందని చెప్పింది. ముంబై పోలీసులలో విశ్వాసం లేనట్టయితే కనుక మళ్లీ వెనక్కి రావద్దంటూ కంగనను ఉద్దేశించి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించింది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత కంగన బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెలకొన్న నెపోటిజం, డ్రగ్స్ కల్చర్ పై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే గురించి కూడా ఆరోపణలు చేసింది. ఆదిత్యను 'బేబీ పెంగ్విన్' అని సంబోధించింది.
Kangana Ranaut
Bollywood
Sanjay Raut
Shiv Sena

More Telugu News