Devineni Uma: ఈ విషయంపై రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పండి: దేవినేని ఉమ

devineni slams ycp
  • అన్నదాతల్లో వ్యవసాయ పంపుసెట్ల మీటర్ భయం
  • వాడకం పెరిగితే షాకేనా?
  • అదనపు బిల్లులు రైతులే చెల్లించాలా?
  • నగదు బదిలీలో సర్కారును నమ్మలేం
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేస్తూ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఉచిత విద్యుత్‌ పథకానికి మంగళం పాడే ప్రక్రియను చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.

'అన్నదాతల్లో మీటర్ భయం, వాడకం పెరిగితే షాకేనా? అదనపు బిల్లులు రైతులే చెల్లించాలా? నగదు బదిలీలో సర్కారును నమ్మలేం, జీవోలో స్పష్టతలేదని తేల్చిచెబుతున్న రైతు సంఘాలు. అప్పులకోసం మమ్మల్ని బలిచేస్తారా? ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్లేనంటున్న రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు' అంటూ దేవినేని ఉమ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News