Raghurama krishnaraju: పవన్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన ఎంపీ రఘురామకృష్ణరాజు.. మీ కృషి భేష్ అంటూ పవన్ ప్రశంస

Pawan kalyan praised to Raghurama krishna raju
  • ఎంపీకి ధన్యవాదాలు తెలిపిన పవన్
  • దేవాలయాల పరిరక్షణకు చేస్తున్న కృషి భేష్ అంటూ ప్రశంస
  • శ్రీవారి భూముల విక్రయ నిర్ణయంపై గొంతెత్తిన రఘురామకృష్ణరాజు
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. బర్త్ డే విషెస్ తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన పవన్.. హిందూ దేవాలయాల పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేవాలయాలు, హెరిటేజ్ సంపదను కాపాడేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను విక్రయించేందుకు ఏపీ రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రయత్నించింది. ఈ నిర్ణయాన్ని రఘురామకృష్ణరాజు తీవ్రంగా నిరసించారు. ఆస్తులు విక్రయిస్తే భక్తులు ఇచ్చిన భూముల మనోభావాలు గాయపడతాయని మండిపడ్డారు. శ్రీవారి ఆస్తుల అమ్మకం నిర్ణయంపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పవన్ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎంపీని ప్రశంసించారు.
Raghurama krishnaraju
YSRCP
Pawan Kalyan
Birthday
Janasena

More Telugu News