India: ప్రపంచ ఆవిష్కరణల సూచీలో నాలుగు స్థానాలు ఎగబాకిన భారత్

  • జీఐఐ ర్యాంకింగ్స్ లో భారత్ కు 48వ స్థానం
  • టాప్ లో స్విట్జర్లాండ్
  • మధ్యస్థ అల్పాదాయ దేశాల్లో మూడో ర్యాంకు

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2020 (జీఐఐ)లో భారత్ స్థానం మరింత మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్ లో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్ తో పోల్చితే భారత్ నాలుగు స్థానాలు ఎగబాకింది. అంతేకాదు, అత్యధిక ఆవిష్కరణలు సాధించిన మధ్యస్థ అల్పాదాయ దేశాల జాబితాలో భారత్  మూడోస్థానంలో నిలిచింది.

వరల్డ్ ఇంటెల్లెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ ఈ ఇండెక్స్ ను సంయుక్తంగా రూపొందించాయి. ప్రస్తుత ప్రపంచ ఆవిష్కరణల సరళి ఆధారంగా 131 దేశాలతో ఈ వార్షిక ఆవిష్కరణల ర్యాంకింగ్ జాబితాను ప్రకటించాయి.

గ్లోబల్ ఇన్నోవేషన్ అంశంలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. కాగా, భారత్... ఐసీటీ సేవల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్ లైన్ సర్వీసులు, ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ల సంఖ్య, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కంపెనీలు తదితర సూచీల్లో టాప్-15లో నిలిచింది. ఇక, విద్యాసంస్థలు (61), వ్యాపార ఆధునికీకరణ (55), సృజనాత్మక ఉత్పాదకత (64) అంశాల్లో భారత్ తన ర్యాంకులను మెరుగుపర్చుకుంది.

More Telugu News