Balineni Srinivasa Reddy: రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని

Balineni says he will resign if farmers have to pay electricity bills
  • ఉచిత విద్యుత్ కు మంగళం అంటూ టీడీపీ ఆరోపణలు
  • ఉచిత్ విద్యుత్ కు కట్టుబడి ఉన్నామన్న బాలినేని
  • టీడీపీ హయాంలో ధర్నాలు చేసి ప్రాణాలు కోల్పోయారని వెల్లడి
ఏపీలో ఉచిత విద్యుత్ కు మంగళం పాడేస్తున్నారని, ఆ పథకం ఎత్తేసేందుకే నగదు బదిలీ తీసుకువస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితే వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని ధర్నాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని బాలినేని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే, తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అన్నారని తెలిపారు.
Balineni Srinivasa Reddy
Farmers
Electricity
Free Current
YSRCP
Telugudesam

More Telugu News