Pawan Kalyan: పవన్ కల్యాణ్ 28వ సినిమా గురించి బిగ్ అనౌన్స్ మెంట్!

Harish Shankar to direct Pawan Kalyans 28th movie
  • వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్ కల్యాణ్
  • హరీశ్ శంకర్ దర్శకత్వంలో 28వ చిత్రం
  • సంగీతాన్ని అందించనున్న దేవిశ్రీ ప్రసాద్
రాజకీయాల కోసం సినిమాలకు కొంత కాలం పాటు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన తాజా చిత్రం 'వకీల్ సాబ్' షూటింగ్ దాదాపు పూర్తైంది. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. తాజాగా మరో బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
Pawan Kalyan
New Movie
28th Movie
Harish Shankar
Tollywood

More Telugu News