Cabinet: ఇక ప్రధాని పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్: కేంద్ర మంత్రి జవదేకర్

  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
  • సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు
  • జమ్మూ కశ్మీర్ లో ఐదు భాషలకు ఆమోదం
Union cabinet approves key decisions

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామక సంస్కరణల కోసం తీసుకువచ్చిన 'మిషన్ కర్మయోగి' కార్యాచరణకు కేబినెట్ సమ్మతి తెలిపినట్టు జవదేకర్ పేర్కొన్నారు.

అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో 5 అధికార భాషలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కశ్మీరీ, ఉర్దూ, డోగ్రీ, హిందీ, ఇంగ్లీషు గుర్తింపు పొందనున్నాయి. వీటికి సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 3 కీలక ఎంవోయూలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

More Telugu News