CPI Ramakrishna: చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపడం ఆశ్చర్యంగా ఉంది: సీపీఐ రామకృష్ణ

  • ఓం ప్రతాప్ మృతిపై ఎలుగెత్తిన టీడీపీ నాయకత్వం
  • డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
  • చంద్రబాబు, లోకేశ్, వర్లలకు నోటీసులు పంపిన డీఎస్పీ
  • లేఖలు రాయకుండా చేయడానికే ఇలా చేస్తున్నారన్న రామకృష్ణ
Ramakrishna says it was ridiculous police sent notices to Chandrababu

దళిత యువకుడు ఓం ప్రతాప్ మరణం వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ అగ్రనేతలు నారా లోకేశ్, వర్ల రామయ్యలకు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నోటీసులు ఇవ్వడం పట్ల సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. దళిత యువకుడి మరణంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారని, డీజీపీకి లేఖ రాశారన్న కారణంతో పోలీసులు ఆ విధంగా స్పందించారంటే ఇక భవిష్యత్తులో ఎవరూ లేఖలు రాయకుండా చేయడానికేనని ఆరోపించారు.

అయినా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఎవరు ఉత్తరాలు రాస్తే వారినే విచారణకు పిలుస్తాం అన్న రీతిలో పోలీసుల వైఖరి ఉందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందో, లేక జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని పరిపాలన సాగిస్తే సరిపోతుందని, లేకపోతే జగన్ ఇడుపులపాయలోనే ఉండి రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే ఆయనే పరిపాలన సాగిస్తారని ఎద్దేవా చేశారు.

More Telugu News