పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: చంద్రబాబు

02-09-2020 Wed 14:28
  • నేడు పవన్ పుట్టినరోజు
  • జనసేనానిపై శుభాకాంక్షల వెల్లువ
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
Chandrababu conveys his best wishes for Pawan Kalyan
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ట్విట్టర్ లో స్పందించారు. పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలినాళ్లలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్... ఆ తర్వాత టీడీపీకి దూరం జరిగారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు విపక్షంలో కొనసాగుతుండగా, పవన్ ఆధ్వర్యంలోని జనసేన బీజేపీకి దగ్గరైంది.