Dating Apps: పాప్యులర్ డేటింగ్ యాప్ లపై నిషేధం విధించిన పాకిస్థాన్

Pakistan bans on famous dating apps
  • అభ్యంతరకర కంటెంట్ ఉందంటూ పాక్ ఆరోపణ
  • టిండర్, గ్రిండర్ వంటి యాప్ లపై నిషేధం
  • కంటెంట్ మార్చుకుంటే నిషేధంపై పునరాలోచిస్తామన్న పాక్
పాశ్చాత్య సంస్కృతికి నిదర్శనాలైన డేటింగ్ యాప్ లు అభ్యంతరకరంగా పరిణమించాయని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఐదు ప్రధాన డేటింగ్ యాప్ లపై నిషేధం విధించింది. టిండర్, గ్రిండర్, ట్యాగ్ డ్, స్కౌట్, సే హాయ్ వంటి డేటింగ్, లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు స్థానిక చట్టాలను అతిక్రమిస్తున్నాయంటూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ ఆరోపిస్తోంది.

అనైతిక, అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించాల్సిందిగా ఈ యాప్ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని, కానీ నిర్దేశిత గడువులోగా స్పందించడంలో ఆయా కంపెనీలు విఫలమయ్యాయని, అందుకే వాటిపై నిషేధం విధించాల్సి వచ్చిందని పాక్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ వెల్లడించింది. ఇకనైనా ఆ యాప్ లు తమ కంటెంట్ విషయంలో పునస్సమీక్ష చేసుకుని, స్థానిక చట్టాలకు అనుగుణంగా మార్చుకుంటే నిషేధం అంశంపై తాము కూడా పునరాలోచిస్తామని అథారిటీ తెలిపింది.
Dating Apps
Pakistan
Ban
Tinder
Grinder

More Telugu News