Raghurama Krishnaraju: వైఎస్సార్ నిలువెత్తు చిత్రపటానికి గులాబీ పూలతో అభిషేకం చేసిన రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishnaraju pays tributes to late YSR
  • నేడు వైఎస్సార్ వర్థంతి
  • పెద్దాయన వర్థంతి కార్యక్రమాలతో వైసీపీ నేతలు బిజీ
  • జోహార్ వైఎస్సార్ అంటూ స్మరించుకున్న రఘురామకృష్ణరాజు

ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఆయన ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లయింది. సీఎం జగన్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా వైఎస్ కు నివాళులు అర్పిస్తూ తమ ప్రియతమ నేతను స్మరించుకుంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గులాబీ పూరేకులు చల్లుతూ వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటో సందడి చేస్తోంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు ట్విట్టర్ లో పంచుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నా నివాళులు... జోహార్ వైఎస్సార్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News