Bonda Uma: ఏపీకి మీరు చేసిందేమిటి? చంద్రబాబు ఏం చేశారో మేము చూపిస్తాం: బోండా ఉమ 

We will show you what Chandrababu done says Bonda Uma
  • హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబే
  • ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు
  • దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికే మణిహారం కాబోతోంది
నవ్యాంధ్ర అభివృద్ధి కోసం పాటు పడిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు ఏం చేశారో తాము చూపిస్తామని అన్నారు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబేనని తెలిపారు. విజన్ 2020లో భాగంగా హైటెక్ సిటీని నిర్మించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.

చంద్రబాబు హయాంలోనే హైదరాబాదులో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్డు వచ్చాయని తెలిపారు. ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఏపీపై చంద్రబాబు శాశ్వత ముద్ర వేశారని చెప్పారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికే మణిహారం కాబోతోందని అన్నారు.
Bonda Uma
Chandrababu
Telugudesam
Amaravati
Hyderabad

More Telugu News