chidambaram: 2013లో మోదీ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసి.. చురకలంటించిన పి.చిదంబరం

chidambaram slams modi
  • 2013లో గుజరాత్‌ సీఎంగా మోదీ
  • దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని అప్పట్లో ట్వీట్
  • యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ వ్యాఖ్య
  • తానూ ఇప్పుడు అదే చెబుతున్నానన్న చిదంబరం
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌నే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది అదే అంటూ చురకలంటించారు. కాగా, మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. మోదీ అసమర్థ నిర్ణయాల వల్ల జీడీపీ తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
chidambaram
Congress
Narendra Modi

More Telugu News