Jagan: ఇడుపులపాయలో సీఎం జగన్ కు ఆత్మీయస్వాగతం

YS Jagan gets hearty welcome at Idupulapaya
  • రేపు వైఎస్సార్ వర్ధంతి
  • ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్న సీఎం జగన్
  • బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి రాక
ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు జరిగే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. కాగా, ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ వచ్చిన సీఎం జగన్ కు ఆత్మీయస్వాగతం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానుమ్, కడప జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. వారితో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించిన సీఎం జగన్ ఆపై వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్ హస్ లో బస చేసేందుకు వెళ్లారు. కాగా, సీఎం రేపు మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
Jagan
Idupulapaya
Welcome
YSR
YSRCP

More Telugu News