Balakrishna: షూటింగుకి రెడీ అవుతున్న బాలకృష్ణ .. ఫిలిం సిటీలో ఏర్పాట్లు!

Balakrishna getting ready for his shooot
  • తారలను వెంటాడుతున్న కరోనా భయం
  • ధైర్యంగా ముందుకు వచ్చిన బాలయ్య
  • ఈ నెల 14 నుంచి షూటింగ్ నిర్వహణ
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన తమ తమ షూటింగులను ఎప్పుడు మొదలెడదామా? అని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటికే ఇన్ని నెలల పాటు చిత్ర నిర్మాణం ఆగిపోవడంతో ఎన్నో విధాలుగా నిర్మాతలు నష్టాలపాలయ్యారు. అయితే, స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం కరోనాకి భయపడి, ఇప్పట్లో షూటింగులో జాయిన్ అయ్యేది లేదని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ మాత్రం షూటింగు చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న మూడో చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు కొంత జరిగింది. దీంతో ఈ నెల 14 నుంచి షూటింగ్ పెట్టుకోమని బాలకృష్ణ నిర్మాతకు చెప్పినట్టు సమాచారం. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ షూటింగ్ చేద్దామని ఆయన దర్శక నిర్మాతలకు చెప్పారట.

దీంతో ఈ నెల 14 నుంచి హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో షూటింగుకి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. అక్కడి గ్రామీణ వాతావరణం సెట్లో ముందుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఇందులో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ని అధికారికంగా ప్రకటిస్తారు.
Balakrishna
Boyapati Sreenu
Ramoji Film City

More Telugu News