Fernando De Noronha: ఈ దీవులకు వెళ్లాలంటే కరోనా పాజిటివ్ వచ్చి వుండాలి!

  • టూరిజం స్పాట్ బ్రెజిల్ లోని ఫెర్నాండో డి నొరాన్హా దీవులు
  • కరోనా వ్యాప్తి కారణంగా మూతపడిన దీవులు
  • వచ్చే వారం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు
Only corona positive people will be entered into these Brazilian Islands

బ్రెజిల్ లోని పెర్నంబుకో స్టేట్ లో ఫెర్నాండో డి నొరాన్హా అనే దీవుల సమూహం ఉంది. కరోనా వ్యాప్తికి ముందు ఈ దీవులకు లక్షల సంఖ్యలో టూరిస్టులు వచ్చేవారు. వరల్డ్ బెస్ట్ బీచ్ అవార్డు కూడా ఈ ద్వీప సమూహానికే లభించింది. అయితే కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ దీవులు బోసిపోయాయి. అయితే వచ్చే వారం నుంచి ఈ ఫెర్నాండో డి నొరాన్హా దీవులను తిరిగి ప్రారంభించాలని అధికార వర్గాలు సిద్ధమయ్యాయి.

అయితే, అదేం విచిత్రమో కానీ, కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లకే తమ దీవిలో ప్రవేశం ఉంటుందని ఓ నిబంధన విధించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా పీసీఆర్ టెస్టులో వచ్చిన ఫలితాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాదు, 20 రోజుల లోపు పరీక్ష చేయించుకుని ఉండాలట. ఇంతజేసీ, కరోనా పాజిటివ్ వ్యక్తులనే దీవులకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో అధికారులు వెల్లడించలేదు.

More Telugu News