Liquor: కృష్ణా జిల్లాలో ప్రమాదకర రీతిలో మద్యం అక్రమ రవాణా.. వీడియో ఇదిగో!

Illegal liquor trafficking busted in Krishna district
  • శరీరం చుట్టూ మందు సీసాలు
  • జారిపోకుండాటేప్ తో అతికించిన వైనం
  • ఇద్దరిని పట్టుకున్న అధికారులు
ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా అధికమైంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్న కృష్ణా జిల్లాలో పలు అక్రమమద్యం కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇదే జిల్లాలో విస్సన్నపేట వద్ద ఇద్దరు యువకులు అక్రమ మద్యం రవాణా చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

మద్యం రవాణాకు వారు ఎంచుకున్న విధానం చూస్తే తెలివితేటలు అనాలో, మూర్ఖత్వం అనాలో అర్థం కాని పరిస్థితి! శరీరం చుట్టూ మందు బాటిళ్లు పెట్టుకుని, వాటి చుట్టూ టేప్ తో అతికించేశారు. దానిపై దుస్తులు ధరించారు. చూసేవారికి పైకి ఏమీ కనిపించదు. ఒకవేళ వారి శరీరాలకు ఏదైనా ఒత్తిడి తగిలి ఆ సీసాలు పగిలిపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయినప్పటికీ వారు ఎంతో రిస్క్ తీసుకుని అక్రమ మద్యం రవాణాకు పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Liquor
Trafficking
Krishna District
Arrest
Andhra Pradesh
Telangana

More Telugu News