Nani: కొడుకుతో కలిసి ఆన్ లైన్ క్లాసులకు నాని

Nani attending online classes along with his son
  • జున్నుకి పాఠ్యాంశాలను అర్థమయ్యేలా వివరిస్తున్న నాని
  • 5న విడుదలవుతున్న నాని తాజా చిత్రం 'వి'
  • అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న చిత్రం
తన అద్భుతమైన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు నాని. ఎలాంటి సినీ నేపథ్యంలేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాని... స్వయంశక్తితో ఎదిగాడు. నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో, తన కుటుంబంతో నాని గడుపుతున్నాడు.

తాజాగా తన కుమారుడితో కలిసి ఆన్ లైన్ క్లాసులకు కూడా హాజరవుతున్నాడు. తన వారసుడు జున్నుకు పాఠ్యాంశాలను అర్థమయ్యేలా వివరిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే... నాని తాజా చిత్రం 'వి' ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో... ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
Nani
Son
Online Classes
Tollywood

More Telugu News