Varla Ramaiah: మేం చెపితే వినలేదు.. ఇప్పుడు సీబీఐ అదే చెపుతోంది: వర్ల రామయ్య

CBI is telling the same thing what  we said earlier says Varla Ramaiah
  • డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మేము మొర పెట్టుకున్నాం
  • ఇదే  విషయాన్ని హైకోర్టుకు సీబీఐ తెలిపింది
  • అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడండి
విశాఖ డాక్టర్ సుధాకర్ అంశం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాస్కులు అందించడం లేదనే బాధను సుధాకర్ వ్యక్తం చేస్తే... ఆయన పట్ల దారుణంగా వ్యవహరించారంటూ ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సుధాకర్ ను పిచ్చివాడుగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని తాము ఎంత మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వర్ల విమర్శించారు. ఇప్పుడు ఇదే అంశం వెనుక కుట్ర ఉందంటూ హైకోర్టుకు సీబీఐ చెప్పిందని అన్నారు. సీబీఐ దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా... అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
Varla Ramaiah
Doctor Sudhakar
Vizag
Telugudesam
CBI
AP High Court

More Telugu News