Baba Sehgal: పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బాబా సెహగల్ స్పెషల్ గిఫ్ట్

Baba Sehgal creates a new remix track with video for Pawan Kalyan birthday
  • రేపు పవర్ స్టార్ బర్త్ డే
  • రీమిక్స్ సాంగ్ రూపొందించిన బాబా సెహగల్
  • పవర్ స్టార్ కు తానిచ్చే కానుక ఇదేనన్న ర్యాప్ సింగర్
దేఖో దేఖో గబ్బర్ సింగ్ అంటూ పవన్ కల్యాణ్ అభిమానులను ఉర్రూతలూగించిన ర్యాప్ గాయకుడు బాబా సెహగల్ మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేయనున్నాడు. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ రీమిక్స్ సాంగ్ ను రూపొందించాడు. దీని గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. "సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు, మిత్రులందరి కోసం ఓ కొత్త రీమిక్స్ ట్రాక్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. పవర్ స్టార్ పుట్టినరోజుకు ఇది నేనిచ్చే కానుక. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి" అంటూ బాబా సెహగల్ పేర్కొన్నాడు.
Baba Sehgal
Pawan Kalyan
Remix Track
Birthday

More Telugu News